ఇప్పుడు కరోనా వల్ల వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న వారికి హెల్పింగ్ గైడ్ 

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. చాలాచోట్ల ఆఫీసుల‌కు కూడా సెలవులు ఇచ్చేసి వర్క్ ఫ్రం హోం చేయమని ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చారు. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులకు అవసరమయ్యే ఈ గైడ్ చదవండి. 

కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాలో కూడా కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 125 కేసులు పాజిటివ్ వచ్చాయి. ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఈ పరిస్థితుల్లో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని చెబుతున్నాయి. యువ కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తప్ప ఇండియాలో వర్క్ ఫ్రం హోమ్ ఇంకా అంత పాపులర్ కాలేదు. అందుకే చాలా  మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేయాలో తెలియక తికమకపడుతున్నారు. అలాంటి వారికి చిట్కాలివీ..

వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోండి 
వర్క్ ఫ్రం హోమ్ చేయాలంటే ముందుగా మీ ఇంట్లోనే డెడికేటెడ్ వర్క్ స్పేస్ క్రియేట్  చేసుకోండి. ఏదైనా గదిలో ఒక కార్నర్‌లో  టేబుల్‌గానీ  టేబుల్ మేట్ గానీ వేసుకోండి. లేదా ల్యాప్టాప్ టేబుల్ సెట్ చేసుకోండి. 
* ఆఫీస్ లో ఉన్నట్టే మీ సిస్టంను కంటి హైట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేస్కోండి.  ఇలా చేస్తే మెడ నొప్పి, భుజం నొప్పి రావు. 

ఆఫీస్ అవర్స్ సెట్ చేసుకోండి
 వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నా కూడా ఆఫీస్ అవర్స్‌నే ఫాలో అవ్వండి. ఇంట్లో నుంచే పని చేస్తున్నాం కదా అని ఎలా పడితే అలా పని చేసుకోకండి. ఈ రోజు ఆఫీసులో ఏ టైంలో పని చేస్తారో అవే టైమింగ్స్ లో ఇంట్లో కూడా పని చేసుకోండి. దీనివల్ల ప‌ని ఆఫీస్‌లో న‌డిచిన‌ట్లే న‌డుస్తుంది. అంతేకాదు  రేపు ఆఫీస్‌కి వెళ్లాక కూడా వ‌ర్క్ అవ‌ర్స్ మారాయ‌న్న ఇబ్బంది ఉండ‌దు.

రెగ్యుల‌ర్  బ్రేక్స్ తీసుకోండి
జ‌స్ట్ ఆఫీస్‌లో చేసిన‌ట్లే ప‌నిలో అల‌సిపోయిన‌ప్పుడు బ్రేక్ తీసుకోండి. ఏదైనా తిన‌డ‌మో టీయో, కాఫీయో తాగ‌డ‌మో చేయండి.  అప్పుడు ప‌ని భారం అనిపించ‌దు. 

 ప్రొడ‌క్టివిటీ పెంచండి 
క్ల‌యింట్స్‌తో మాట్లాడ‌టం, ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌తో, ఆఫీస్‌లో మీ ఇన్‌ఛార్జితో రెగ్యుల‌ర్‌గా ట‌చ్‌లో ఉండ‌టం మంచిది. దీనివ‌ల్ల మీ ప‌నిలో ప్రొడ‌క్టివిటీ పెరుగుతుంది. అంతేకాదు వ‌ర్క్ ఫ్రం హోమ్ అని చెప్పినా కూడా వ‌ర్క్ మీద మీ కాన్స‌న్‌ట్రేష‌న్ త‌గ్గ‌లేద‌ని మేనేజ్‌మెంట్ గుర్తిస్తుంది. 

వ‌ర్క్ ఫ్రం హోమ్ గైడ్‌ క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్‌ వ‌ర్క్ ఫ్రం హోమ్ టిప్స్‌ Work From home Work from home guide Work from home tips Corona virus affect